
నారాయణపేట, 28 నవంబర్ (హి.స.) సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయాలకు పాటుబడిన మహాత్మ జ్యోతిబాపూలేకు దండలు చేసి నివాళులర్పించడం కాదు.. ఆయన ఆశయాలను పాటిస్తూ పాటింప చేస్తూ అనుసరించడమే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ రచయిత అంబేద్కర్ కి గురువులా వ్యవహరించిన జ్యోతిబాపూలే మూఢనమ్మకాలను కాదని మహిళలు చదువుకుంటే కుటుంబము, దేశము అభివృద్ధి మార్గంలో పయనిస్తుందని సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడని మహిళా చదువుల కోసం తన భార్యనే ఉపాధ్యాయురాలిగా నియమించి ఆడవారికి చదువు చెప్పడానికి పాటుబడిన వ్యక్తి అని వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చిన గౌరవ నివాళులు అని వారు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు