నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి.. నాగర్ కర్నూల్ కలెక్టర్
నాగర్ కర్నూల్, 28 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ స
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 28 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ పేర్కొన్నారు. వారు సంబంధిత అధికారులతో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల రెండవ రోజైన శుక్రవారం నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు రిటర్నింగ్ అధికారులను నామినేషన్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రం ముందు ఫోటోతో ఓటర్ల జాబితా, గ్రామాల వార్డుల వారిగా రిజర్వేషన్ల జాబితా అంటించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande