
మెదక్, 28 నవంబర్ (హి.స.)
మెదక్ జిల్లా నర్సాపూర్
నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గం, తునికి గ్రామానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్, బీజేపీ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో స్థానిక నాయకులు, 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు హైదరాబాద్ నివాసం లో గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి, ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ చెప్పేది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, వాస్తవానికి అది సబ్కా బక్వాస్ అని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు