
మేడ్చల్ మల్కాజ్గిరి, 28 నవంబర్ (హి.స.)
మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ
ప్రతాపసింగారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో 12 ఏండ్ల క్రితమే నిర్మించిన కంఠ మల్లేశ్వర ఆలయంలో గౌడ కులస్తులు నిత్యం ఇక్కడ పూజలు చేస్తున్నారని.. అయితే కొందరు గిట్టని వ్యక్తులు ప్రభుత్వ భూమిలో గుడి నిర్మించారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీతో వచ్చి కూల్చి వేశారని శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామంలోని సర్వే నెంబర్ 378/71లో 5 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు