
మార్కాపురం, 28 నవంబర్ (హి.స.)
పెద్దరవీడు, ప్రకాశం జిల్లా మద్దలకట్ట- సానికవరం జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మద్దలకట్ట - సానికవరం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది శివస్వాములు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ