
సంగారెడ్డి, 28 నవంబర్ (హి.స.) చలికాలంలో వచ్చే దట్టంగా కమ్ముకున్న పొగ మంచులో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదంటూ వాహనదారులకు కొన్ని సూచనలను అందజేశారు. నేషనల్ హైవే, ముంబై హైవే పై వెళ్లే వాహన దారులు రాత్రి 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు ప్రయాణాలను పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని అన్నారు. పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రాణాలకు రక్షణ ఉంటుందని తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు