మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, 28 నవంబర్ (హి.స.) భారతదేశానికి స్వాతంత్య్రం రాగమునుపే దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన
ఎమ్మెల్యే వీర్లపల్లి


షాద్నగర్, 28 నవంబర్ (హి.స.)

భారతదేశానికి స్వాతంత్య్రం రాగమునుపే దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. స్వాతంత్య్రం రాకమునుపే జ్యోతిరావు పూలే వాడవాడల విద్యాలయాలను ఏర్పాటు చేసి సమాజాన్ని చైతన్య పరచాలని తెలిపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande