
సిద్దిపేట, 28 నవంబర్ (హి.స.) వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన
తర్వాతే వాహనాలను వదలాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు-2025 కు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ములుగు మండలంలోని చిన్న తిమ్మాపూర్ గ్రామం క్లస్టర్ ఆమె సందర్శించారు. అధికారులతో మాట్లాడిన ఆమె ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని నిబంధనల అమలులో ఏ తప్పు చోటు చేసుకోకూడదన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి దశను కచ్చితంగా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం వంటిమామిడి శివారు-రాజీవ్ రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఈ తనిఖీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు