
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
శ్రీలoకలో వరదలు బీభత్సం
సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 56 మంది మృతి చెందినట్టు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. వదరల కారణంగా పలు ప్రాంతాల్లో ఇల్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి.
ఇప్పటి వరకు 600 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. రాజధాని కొలంబోకు తూర్పున 300కిమీ దూరంలో ఉన్న బదుల్లా, సువారా ఎలియా కేంద్రం తేయాకు పండించే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 25మందికి పైగా మరణించారన్నారు. 21 మంది గల్లంతయ్యారని, 14 మంది గాయపడ్డారని ప్రభుత్వం విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు