
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది
విద్య ఒకటే అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అందరికీ విద్యను అందించేలా కృషి చేసిన మహనీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి పురస్కరించుకొని శుక్రవారం సైనిక్పురి చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు