
అమరావతి, 28 నవంబర్ (హి.స.)
తీర ప్రాంత నగరం ‘విశాఖ’ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. విశాఖపట్నాన్ని గ్లోబల్ డేటా సెంటర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే అర డజనుకు పైగా సంస్థలు నగరంలో కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటిని అతి తక్కువ వ్యవధిలో సాకారం చేయడానికి మల్టీ నేషనల్ కంపెనీలు చేతులు కలిపి జాయింట్ వెంచర్‌గా ఏర్పడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ