
యాదాద్రి భువనగిరి, 28 నవంబర్ (హి.స.)
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో గట్టి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లాలో చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు వెల్లడించారు. శుక్రవారం బీబీనగర్ టోల్ గేట్ వద్ద గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎస్ ఎస్ టి టీం చెక్ పోస్ట్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారననే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివరాలను
పోలీస్, రెవిన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని ఆపి వీడియో రికార్డ్ చేస్తూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు