
అమరావతి, 28 నవంబర్ (హి.స.) ఏపీలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేశ్ శర్మపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్ వద్దకు ఓ మహిళ విడాకుల కేసు విషయమై మాట్లాడేందుకు వెళ్లగా.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంకటేశ్ శర్మపై 75 (1) (i) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
అలాగే గతంలోనూ అతనిపై వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తరచూ అతను మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. క్లబ్బులకు వెళ్లే అలవాటున్న వెంకటేశ్.. అక్కడ మహిళలపై కరెన్సీ విసిరిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలో వెంకటేశ్ సంపాదన, ఆస్తుల వివరాలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV