రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చారు : సీఎం
అమరావతి, 28 నవంబర్ (హి.స.) ఇటీవలే ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చి పనులను పున: ప్రారంభించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన బ్యాంకు భవనాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని న
చంద్రబాబు


అమరావతి, 28 నవంబర్ (హి.స.) ఇటీవలే ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చి పనులను పున: ప్రారంభించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన బ్యాంకు భవనాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని నిర్మాణానికి మీకు మేము సహకరిస్తామని స్వచ్ఛంధంగా అమరావతి రైతులు ముందుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇది నిజంగా అభినందనీయమని విషయమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి స్ఫూర్తి ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదున్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛంధంగా ల్యాండ్ పూలింగులో ఇస్తామన్నప్పుడు.. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ జరిగిన ప్రాంతం అమరావతి అని భావించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆగిపోయిన పనులకు ప్రధానమంత్రి వచ్చి పున: ప్రారంభం చేశారన్నారు. 2028 మార్చి నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితి ఉందన్నారు.

పనులు జరుగుతున్నాయంటే కారణం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక అసాధ్యమైన పనిని ప్రారంభించాం.. పనులు స్పీడప్ చేసే సమయంలో ప్రభుత్వం మారింది.. ఐదేళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా తమకంటే వేగంగా 15వేల కోట్లు ఇవ్వడానికి పనులు ప్రారంభించమని ఆమె భరోసానిచ్చారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande