ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 26 జిల్లాలకు విస్తరించిన జ్వరాలు!
అమరావతి, 28 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో ''స్క్రబ్ టైఫస్'' జ్వరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఈ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నల్లిని పోలిన ఒక చిన్న కీటకం (ట్రాంబికులిడ్ మైట్) కుట్టడం ద్వార
/scrub-typhus-outbreak-grips-andhra-pradesh-all-26-districts-affected


అమరావతి, 28 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో 'స్క్రబ్ టైఫస్' జ్వరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఈ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నల్లిని పోలిన ఒక చిన్న కీటకం (ట్రాంబికులిడ్ మైట్) కుట్టడం ద్వారా 'ఓరియంటియా సుట్టుగముషి' అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధికి కారణమవుతుంది.

ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడి, దద్దుర్లు వస్తాయి. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడతాయి. అయితే చాలామంది దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే, అది తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులు నమోదు కాగా, కాకినాడ (141), విశాఖపట్నం (123) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. సాధారణ యాంటీబయాటిక్స్‌తోనే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, అయితే అవగాహన లేకపోవడమే సమస్యకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande