టిటిడి కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ వేగవంతం
తిరుమల 29 నవంబర్ (హి.స.) తితిదే కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్‌ విచారణ వేగవంతం చేసింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్.. తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్ట
టిటిడి కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ వేగవంతం


తిరుమల 29 నవంబర్ (హి.స.)

తితిదే కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్‌ విచారణ వేగవంతం చేసింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్.. తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వారిలో ఏడుగురు తితిదే ఉద్యోగులు ఉన్నారు. 2019-2024 మధ్య తితిదే కొనుగోలు విభాగంలో పని చేసిన జీఎంలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లపై సిట్‌ కేసులు నమోదు చేసింది. గతంలో జీఎంలుగా పని చేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి ఇందులో ఉన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు పేర్కొన్న నిందితుల సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని అరెస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande