
అమరావతి, 29 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవి కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో విజయానంద్ పదవీకాలం ముగియనుంది. అయితే, అతని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ