'రోజు కొడుతున్నారు, తిండి కూడా పెట్టడం లేదు.. దుబాయ్ లో ఏపీ మహిళ కన్నీటి గాథ
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) ఏపీకి చెందిన ఓ మహిళ దుబైలో చిక్కుకుపోయి తనని కాపాడాలని పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ ఉపాధి కోసం వెళ్లి, అక్కడి యజమానుల వేధింపులకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ ఒకరు కన్నీటితో వీడియోలో తన బాధలు చెప్ప
ఏపీ మహిళ


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

ఏపీకి చెందిన ఓ మహిళ దుబైలో చిక్కుకుపోయి తనని కాపాడాలని పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ ఉపాధి కోసం వెళ్లి, అక్కడి యజమానుల వేధింపులకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ ఒకరు కన్నీటితో వీడియోలో తన బాధలు చెప్పుకొచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంచి జీవనం కోసం దుబాయ్ వెళ్లగా, ఆమెను నకిలీ ఏజెంట్ మోసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యజమానుల చేతుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, రోజూ కొడుతున్నారని, కనీసం సరిగా తిండి కూడా పెట్టడం లేదని ఆ వీడియోలో మహిళ కన్నీటి పర్యంతమైంది.

తనను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande