
ఆదిలాబాద్, 29 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ నియోజకవర్గంలోని
అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు
కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఎంతోమంది బిజెపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. శనివారం బోరజ్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉపసర్పంచ్ నందుతో పాటు సింగిల్ విండో డైరెక్టర్లు, పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు