రాజధాని.అమరావతిలో పండగ వాతావరణం
అమరావతి, 29 నవంబర్ (హి.స.) తుళ్లూరు, : ప్రజా రాజధాని అమరావతిలో పండగ వాతావరణం నెలకొంది. మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. సీఆర్డీఏ కార్యాలయం వద్ద శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగిన వివిధ బ్యాంకులు
రాజధాని.అమరావతిలో పండగ వాతావరణం


అమరావతి, 29 నవంబర్ (హి.స.)

తుళ్లూరు, : ప్రజా రాజధాని అమరావతిలో పండగ వాతావరణం నెలకొంది. మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. సీఆర్డీఏ కార్యాలయం వద్ద శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగిన వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, స్థానికులు తరలివచ్చారు. లోపలి ఆవరణ నిండిపోవడంతో బయట కూడా టెంట్లు, కుర్చీలు, ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి సౌకర్యవంతంగా కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు. వచ్చినవారందరికీ తాగునీరు, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. మంత్రులు ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమని రైతులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande