
వరంగల్, 29 నవంబర్ (హి.స.) కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకరోజు పర్యటన కోసమై వరంగల్ విచ్చేశారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు, జగత్ జననీ, అమ్మలగమ్మగా కీర్తించబడుతున్న శ్రీ భద్రకాళి ఆలయానికి కిషన్ రెడ్డి చేరుకొన్నారు. వారికి ఆలయ సంప్రదాయాల ప్రకారం అధికారులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ సునీత ప్రధాన అర్చకులు శేషుల నేతృత్వంలో మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..