బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తాడోపేడో తేల్చుకుందాం.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) బీసీలకు 42 రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుందామని బీసీ సంఘాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత్ రావు పిలుపునిచ్చారు. ఈ రోజు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ సమావేశ
వీహెచ్ కీలక వ్యాఖ్యలు


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

బీసీలకు 42 రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుందామని బీసీ సంఘాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత్ రావు పిలుపునిచ్చారు. ఈ రోజు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలకు లేఖ రాశానని తెలిపారు. బీసీ బిల్లు అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande