నకిలీ గోల్డ్ ముఠాను పట్టుకున్న కొత్తగూడెం పోలీసులు..
భద్రాద్రి కొత్తగూడెం, 29 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఓ తండాకు చెందిన యువకుడిని కొత్తగూడెం పోలీసులు అదుపులో తీసుకున్నారు. నకిలీ గోల్డ్ విక్రయించే ముఠా సభ్యులతో సంబంధాలు పెట్టుకుని నకిలీ గోల్డ్ను బ్యాంకులలో
నకిలీ గోల్డ్


భద్రాద్రి కొత్తగూడెం, 29 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కారేపల్లి మండల పరిధిలోని ఓ

తండాకు చెందిన యువకుడిని కొత్తగూడెం పోలీసులు అదుపులో తీసుకున్నారు. నకిలీ గోల్డ్ విక్రయించే ముఠా సభ్యులతో సంబంధాలు పెట్టుకుని నకిలీ గోల్డ్ను బ్యాంకులలో తాకట్టు పెట్టిన ఓ యువకుడు కొత్తగూడెం పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. మండల పరిధిలోని కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి, హైదరాబాదులో నకిలీ గోల్డ్ను తయారు చేయించి బ్యాంకులో తాకట్టు పెడుతున్నారని ఈ మధ్య కాలంలో కారేపల్లిలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

శుక్రవారం కారేపల్లికి చెందిన కొంతమంది హైదరాబాదులో తయారు చేసిన నకిలీ బంగారాన్ని భద్రాద్రి కొత్తగూడెం త్రీటౌన్ పరిధిలో ఓ బ్యాంకులో తాకట్టు పెట్టిన క్రమంలో అందులో ఉన్న బ్యాంక్ మేనేజర్ తెలివిగా నకిలీ గోల్డ్ అని గుర్తించి, త్రీ టౌన్ పరిధిలోని పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించినట్లు స్థానికులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande