
తిరుమల: 29 నవంబర్ (హి.స.)
తిరుమలలో పూర్తిగా విద్యుత్ వాహనాలనే వినియోగంలోకి తీసుకురావడానికి విస్తృత చర్యలు చేపట్టినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి()తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పవిత్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా రద్దు చేయనున్నట్టు వివరించారు. తొలిగా తిరుపతి, తిరుమల మధ్య పూర్తిగా విద్యుత్ బస్సులు మాత్రమే నడిచే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ