నకిలీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) నకిలీ ఐపీఎస్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ పరిధిలోని కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే, నకిలీ ఐపీఎస్ శశికాంత్ను అరెస్టు చేసే క్రమంలో ఆయన ఇంట్లో కానిస్టేబుల్ చోరీక
కానిస్టేబుల్ అరెస్ట్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

నకిలీ ఐపీఎస్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ పరిధిలోని కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే, నకిలీ ఐపీఎస్ శశికాంత్ను అరెస్టు చేసే క్రమంలో ఆయన ఇంట్లో కానిస్టేబుల్ చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి ఇంటితో పాటు అరెస్టు క్రమంలో వీడియో తీస్తూనే ఏకంగా రూ.25 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను దొంగతనం చేశాడు. శశికాంత్ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ లిస్ట్లో రోలెక్స్ వాచ్ మిస్సింగ్ అయినట్టు గ్రహించిన సిబ్బంది శ్రవణ్ కుమార్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తప్పు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande