కార్ సర్వీస్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) కార్ల సర్వీసింగ్ వీల్ అలైన్మెంట్ సెంటర్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పెయింట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుచిత్ర రోడ్డు ప్రధాన రహదారి రాఘవేంద్ర కాలనీలో సన్ రైస్ వా
అగ్నిప్రమాదం


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

కార్ల సర్వీసింగ్ వీల్ అలైన్మెంట్ సెంటర్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పెయింట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుచిత్ర రోడ్డు ప్రధాన రహదారి రాఘవేంద్ర కాలనీలో సన్ రైస్ వాటర్ వాష్ అండ్ వీల్ అలైన్మెంట్ సర్వీస్ సెంటర్ ఉన్నది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో సర్వీస్ సెంటర్ లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. సర్వీస్ సెంటర్ లో టైర్ల విక్రయాలు కూడా జరుగుతుండటంతో టైర్ల నిల్వ కూడా ఉండటంతో వాటికి మంటలు అంటుకొని భారీగా ఎగిసి పడినట్లుగా తెలుస్తుంది. కాగా ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande