
తిరుమల:, 29 నవంబర్ (హి.స.)విశాఖపట్నంకు గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( అన్నారు. సినీనటులు శ్రీకాంత్, అశోక్‌తో కలిసి శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ... గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అద్భుతమైన మార్పులు జరిగాయని గుర్తు చేశారు. సైబరాబాద్ వంటి నగరం ఏర్పాటు కావడంలో మైక్రోసాఫ్ట్ కీలకంగా వ్యవహరించిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ