శ్రీలంక తీరంలో దిత్వ తుఫాను .ప్రభావం కొనసాగుతోంది
అమరావతి, 29 నవంబర్ (హి.స.) ,:నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫానుప్రభావం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 280 కి
శ్రీలంక తీరంలో దిత్వ తుఫాను .ప్రభావం కొనసాగుతోంది


అమరావతి, 29 నవంబర్ (హి.స.)

,:నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫానుప్రభావం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 280 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని వివరించారు.

ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న తుఫాను చెన్నైకి అతి సమీపానికి వస్తుందని వివరించారు. ఈరోజు రాత్రికి తుపాను 60కిలోమిటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పుకొచ్చారు. తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. మూడు రోజుల్లో ఏపీలో కొన్నిచోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ, ఇంకొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజుల వరకు తుఫాను తీరం దాటే పరిస్థితి లేదని అన్నారు. తీరం దాటకుండానే తుఫాను క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

రేపు(ఆదివారం)తెల్లవారుజామునకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తుఫాను ప్రభావంతో ఇవాళ(శనివారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తుఫాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని కోరారు. మూడు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande