
జడ్చర్ల , 29 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రజలవి దిష్టి కండ్లు అంటూ
వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కు ఏపీ పై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్లిపోవాలని, అలా చేయకుండా కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీశారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా ? అని ప్రశ్నించారు.శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు