కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదు.. కేటీఆర్
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ స
కేటీఆర్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నేటి పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడూ కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

అటు కేంద్రంలో... ఇటు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ గారి ప్రాణం ముఖ్యమని, దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande