
తెలంగాణ, 29 నవంబర్ (హి.స.)
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ నాయకులు గ్రౌండ్లో పని చేస్తేనే గుర్తింపు ఉంటుంది, గ్రామాలలో పనిచేస్తే ప్రజల నాడీ తెలుస్తుందని అందువల్ల సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత రాబోయే ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉండాలన్నారు. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్ఈయూఐ (NSUI), యూత్ కాంగ్రెస్లో పని చేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో ఎన్ఎస్ఈయూఐలో పని చేసినవారేనన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు