దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు : మంత్రి సీతక్క
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివస్ చేసేవారని, ఇప్పుడు 10 రోజులపాటు దీక్షా దివస్ పేరుతో ప్రజలను మోసం చేస్తు
మంత్రి సీతక్క


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు

డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివస్ చేసేవారని, ఇప్పుడు 10 రోజులపాటు దీక్షా దివస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివస్ లో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా.. ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అలాగే పలు ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. వీటిని ప్రజలకు వివరించేందుకు 10 రోజులపాటు తాము కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వాటిని అడ్డుకునేందుకే దీక్షా దివస్ ను 10 రోజు చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ చేస్తున్న వాటిని ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వందల రెట్లు లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమేనన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande