నవ్యాంద అమరావతి.రాజధాని.విస్తరణ
అమరావతి, 29 నవంబర్ (హి.స.) , అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో 29 గ్రామాల్లో భూసమీకరణ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 7 గ్రామాల పరిధిలో భూసమీకరణకు ప్రణాళిక రూపొందించింది. రెండో విడత భూసమీకరణ ద
నవ్యాంద అమరావతి.రాజధాని.విస్తరణ


అమరావతి, 29 నవంబర్ (హి.స.)

, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో 29 గ్రామాల్లో భూసమీకరణ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 7 గ్రామాల పరిధిలో భూసమీకరణకు ప్రణాళిక రూపొందించింది. రెండో విడత భూసమీకరణ ద్వారా తీసుకునే భూమిలో కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, రైల్వేలైన్‌ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఉత్తర-దక్షిణం, తూర్పు, పడమర రహదారులు ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతో అనుసంధానం కానున్నాయి. అమరావతి పరిధి విస్తరిస్తుండడంతో వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు వెసులుబాటు కలిగింది. దీనివల్ల అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande