
రాజన్న సిరిసిల్ల, 29 నవంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో మొదటి విడత నామినేషన్ల దాఖలుకు నేడు(శనివారం) రోజే ఆఖరి గడువని ఇంఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో రుద్రంగి వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్ 11 న ఎన్నికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు నేడు శనివారం 05.00 గంటల వరకు దాఖలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు