పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం
కామారెడ్డి, 29 నవంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీస
ఎలక్షన్స్


కామారెడ్డి, 29 నవంబర్ (హి.స.)

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande