
ఖమ్మం, 29 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా షరీఫ్ అనే ఇద్దరు యువకులు ప్రేమించాలని వెంట పడి వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఆ మైనర్ బాలిక పై గురువారం రాత్రి దాడి చేశారు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన ఫిర్యాదు పై దర్యాప్తు చేపట్టి పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా షరీఫ్ అనే ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కోసం సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు