నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..
నల్గొండ, 29 నవంబర్ (హి.స.) మహిళను దారుణంగా హత్య చేసి వ్యవసాయ బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, పాలెం తండాలో ఈ దారుణ హత్య బయటపడింది. తండాకు చెందిన సభావత్ జ్యోతి (30) నాలుగు రోజుల క్రితం కనిపించకుండా ప
మర్డర్


నల్గొండ, 29 నవంబర్ (హి.స.) మహిళను దారుణంగా హత్య చేసి

వ్యవసాయ బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, పాలెం తండాలో ఈ దారుణ హత్య బయటపడింది. తండాకు చెందిన సభావత్ జ్యోతి (30) నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో తండావాసులు అటుగా వెళ్లి పరిశీలించారు. దీంతో జ్యోతి మృతదేహం వారి కంటపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాలెం తండాకు చేరుకుని జ్యోతి డెడ్ బాడీని బయటకు తీశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే జ్యోతిని హత్య చేసి బావిలో పడేసినట్టు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande