
నిర్మల్, 29 నవంబర్ (హి.స.)
దివంగత మాడవి తుకారాం ను నేటి
యువత ఆదర్శంగా తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మండలంలోని లక్షెట్టిపేట, ఎక్స్ రోడ్డు లలో మాడవి తుకారాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్స్ రోడ్డు లో గల మాడవి తుకారాం విగ్రహానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆయన కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు, వర్ధంతి నిర్వహణ కమిటీ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాడవి తుకారాం ఆదివాసీ సమాజంలో జన్మించి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న గొప్ప మేధావి అని కొనియాడాడు. ఆనాడు ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో ఉన్నత స్థాయిలో ఉంటే, నేడు చదువులో రాణించే విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆదివాసీ సమాజంలోనీ విద్యార్థులు ఈయనను ఆదర్శంగా తీసుకొని ఐఏఏస్, ఐపీఎస్, ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆకాక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు