కోదాడ వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ను ఢీకొని యువకుడు మృతి..
కోదాడ, 29 నవంబర్ (హి.స.) ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన యువకుడు షేక్ జానీ పాషా (25) కోదాడలో పనిమీద ద్విచక్రవాహ
యాక్సిడెంట్


కోదాడ, 29 నవంబర్ (హి.స.)

ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని యువకుడు

మృతి చెందిన సంఘటన కోదాడ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన యువకుడు షేక్ జానీ పాషా (25) కోదాడలో పనిమీద ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. అదే సమయంలో అడ్డూరు కాలనీ వద్ద రోడ్డు వైపు ఎటువంటి సూచికలూ, లైటింగూ లేకుండా ఓ ట్రాక్టర్ను నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రి వెలుతురు తక్కువగా ఉండటంతో జానీ పాషా ట్రాక్టర్ను గుర్తించలేకపోయాడు. ఇక వెనుక నుండి ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అతను తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం తెలుసుకొని కోదాడ రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande