
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న కార్మికుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (KPHB) ప్రాంతంలో ఉదయం వేళ రోడ్డు పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారు, వాటర్ ట్యాంక్ మధ్యలో చిక్కుకున్న కార్మికుడు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు