గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3 వేల డ్రోన
రేవంత్ సర్కార్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3 వేల డ్రోన్లతో ఆకాశంలో 'Telangana is Rising.. Come, Join the Rise' అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అబుదాబీ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో Happy NewYear అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్సమ్మిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనుంది. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డు అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande