కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
అమరావతి, 29 నవంబర్ (హి.స.) కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్పందించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సాను
chandrababu naidu london visit investment meet 2025 avn


అమరావతి, 29 నవంబర్ (హి.స.)

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్పందించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందేలా చూడాలని సూచించారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వారిని కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని చిక్కహోసహళికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో పెద్దలు వెంకటేష్ (76), మీనాక్షి(32), సతీష్(34), చిన్నారులు బనిత్(5), రుత్విక్ (4) ఉన్నారు. డ్రైవర్ చేతన్, గంగమ్మలకు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రవాణ శాఖ మంత్రి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్​లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు మరోసారి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాణంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పర్యవేక్షణ పెంచాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

వివరాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ ప్రమాదం పై జిల్లా ఇన్​​ఛార్జ్​ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఐదుగురు మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహాయ, సహకారం అందించాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande