మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేసు : సీపీ అవినాష్ మొహంతి
రంగారెడ్డి, 3 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీపీ అవినాష్ మొహంతి తెలిపారు.
అవినాష్ మొహంతి


రంగారెడ్డి, 3 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం

మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో 21 మంది మరణించగా.. వారిలో 14 మందిని గుర్తించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. బస్సులో ప్రయాణించిన అందరి వివరాలను తెలుసుకుంటున్నామని, ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని సీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది తాండూరు, చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ ను దస్తగిరి బాబా (38)గా, టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాష్ గా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande