బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో దురదృష్టవశాత్తు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓకేసారి దుర్
బస్సు ప్రమాదం


హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో దురదృష్టవశాత్తు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓకేసారి దుర్మరణం పాలయ్యారు. తాండూరు పట్టణంలో గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు అనూష సాయిప్రియ, నందిని కలిసి తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలు చూసిన తాండూరు పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande