
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో సోమవారం చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో మాకు టీడీపీ మద్దతు ఉందని స్పష్టం చేశారు. టీడీపీ ఒక్కటే కాదని.. ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ తమకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఎన్నికల వేళ తాము ఎప్పుడూ సర్వేలు చేయించుకోలేదని.. తాము సర్వేలను నమ్మే బ్యాచ్ కాదని.. ఇంటింటి ప్రచారాన్ని, బీజేపీ కేడర్ను నమ్ముతామని అన్నారు. 2023లో టికెట్ ఇస్తే గెలువని ఆజార్కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం మాకు చేతకాదని.. చేసే పనులే చెప్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా.. బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్లో త్రిముఖపోటీ ఉంది కాబట్టి బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నిక దేనికీ ప్రాధాన్యం కాదు.. ప్రజలు విజ్ఞులు.. ఎప్పుడు ఏ పార్టీని ఆదరించాలో వారికి తెలుసని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలి.. రాజకీయంగా ఎదగాలని తాను కోరుకుంటానని చెప్పారు. జూబ్లీహిల్స్తో పాటు బిహార్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు