చేవెళ్ల బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి, 3 నవంబర్ (హి.స.)చేవెళ్లలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 21 మంది మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ స
చేవెళ్ల బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి


అమరావతి, 3 నవంబర్ (హి.స.)చేవెళ్లలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 21 మంది మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 21 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం అధికారులు వారిని హైదరాబాద్ లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande