ప్రజాగ్రహం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ :
వికారాబాద్, 3 నవంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న స్థానిక చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు జనం నుండి నిరసన సెగ తగిలింద
ఎమ్మెల్యే కాలే యాదయ్య


వికారాబాద్, 3 నవంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న స్థానిక చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు జనం నుండి నిరసన సెగ తగిలింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయిని చుట్టుముట్టి అక్కడ ఉన్న జనం నిరసన తెలిపారు. దాంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే ప్రమాద స్థలం నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande