
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం
మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనలో 21 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దుర్ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పార్టీ ముఖ్య నేతలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..