
మేడ్చల్ మల్కాజిగిరి, 3 నవంబర్ (హి.స.)
నూతన రాచకొండ కమిషనరేట్
కార్యాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం సిపిఆర్ఎ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్ కార్యాలయ నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులతో సి పి సుధీర్ బాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లతో అధికారులతో సమావేశమయ్యారు. సంబంధిత అధికారులు నిర్మాణ నమూనా మ్యాప్ను, మోడల్ను, విభాగాలను వివరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సీపీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు