పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, 3 నవంబర్ (హి.స.) రైతులు సిసిఐ కేంద్రాలను వినియోగించుకొని కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి, అర్బన్ మండలంలోని సంకేపల్లి, కో
ఆది శ్రీనివాస్


వేములవాడ, 3 నవంబర్ (హి.స.)

రైతులు సిసిఐ కేంద్రాలను

వినియోగించుకొని కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి, అర్బన్ మండలంలోని సంకేపల్లి, కోనరావుపేట మండలం సుద్దాల గ్రామాల్లో సిసిఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. రైతులు పండించిన పత్తిని సిసిఐ మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందనీ, ఒక క్వింటాల్ పత్తికి రూ.8110 మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు.

అందుబాటులో వేములవాడ రైతులకు నియోజకవర్గంలో మూడు సెంటర్లలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకున్నామని, ఈ ప్రాంతంలో నల్ల రేగడి భూములు ఉండటం వల్ల రైతులు పత్తిని పండించడానికి ఎక్కువ ఆవశ్యకత ఉందనీ, మన జిల్లా రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ మంత్రితో మాట్లాడి పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande